శ్రీ సాయి మాస్టర్ సేవా ట్రస్టు
గొలగమూడి
సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురుసేవ

హోం పేజిపుస్తకాలు & డౌన్‌లోడ్లుe-మాస పత్రికలుచిత్రమాలికమహాత్ములుసత్సంగముశ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం గురించిమా గురించి / సంప్రదించండి
in English


గురుబంధువులందరికీ వైశాఖ పూర్ణిమ నమస్కారములు. శ్రీ సుబ్బరామయ్య సార్ జీవితవిధానము నుండి మనము చూసి నేర్చుకోవలసిన ముఖ్య సంఘటనలను "చూచి నేర్చుకో" అను శీర్షికన ఈ 23-మే-2024 "శ్రమతో సేవ - సేవతో కైవల్యం" సంచిక ద్వారా స్మరించుకుని, ఆచరణ సౌలభ్యము చేసుకుందాము...

దత్త సాంప్రదాయమునకు చెందిన త్రిమూర్తులు

Sai Swamy Master
శ్రీ శిరిడీ సాయిబాబా
శ్రీ వెంకయ్య స్వామి
శ్రీ ఎక్కిరాల భరద్వాజ

      దీనజనోద్ధరణ కొరకు, భక్త సంరక్షణ కొరకు, ముముక్షువులకు మార్గం చూపడానికి ఆ పరమాత్మ మన మధ్య సద్గురువుగా అవతరిస్తారు. అట్టి సద్గురువులలో శాస్త్రాలలో నిర్దేశించబడిన సర్వవ్యాపకత్వం, సర్వసమర్ధత, సర్వజ్ఞత్వాలు సంపూర్ణముగా ప్రకటమవుతాయి. అలా ప్రకటమయినవారే గొలగమూడిలో వెలసిన అవధూత శ్రీ వెంకయ్యస్వామివారు.

      మహాత్ములు శరీరం చాలించిన తర్వాత గూడా నిత్యసత్యులై కోరిన చోట శరీరంతో కన్పించగలరు. అదృశ్యంగా అంతటా నిండియుండి ఎల్లవేళలా తమ భక్తుల ప్రార్థనలను, చేష్టలను సాక్షిగా గమనిస్తూనే ఉంటారు. మనము ఏమారి వారిని ప్రార్థించకున్నా, వారు మనలను అన్ని వేళలా రక్షిస్తారు. శ్రీ స్వామివారి మహాసమాధి అనంతరం జరుగుతున్న లీలలే అందుకు నిదర్శనం. శ్రీ స్వామివారికి మతభేదం లేదు. వారి సమాధిని అన్ని కులాల, మతాల వారూ దర్శించి బాధలను తొలగించుకుంటున్నారు.

      నిరంతర సద్గురు స్మరణ వలన భవభంధాలు దగ్ధమై తనకు, గురువుకూ భేదం లేకుండా పోయి భక్తుడు ముక్తుడవుతాడన్నది శాస్త్ర వాక్యం. శ్రీ స్వామివారి జీవితం సాధువులకు ఆదర్శప్రాయమైన కొండపై నున్న జ్యోతివలె మార్గదర్శకమైనది. సర్వజీవుల మీద ప్రేమ, నిరాడంబరత, ధ్యేయముపై శ్రద్ధ, కార్యదీక్ష, వైరాగ్యము, ధర్మాచరణ, ఇంద్రియ నిగ్రహము వారు ఆచరించి మనకు చూపిన దివ్య మార్గాలు.

      శ్రీ సాయినాధుని, శ్రీ రమణ మహర్షినీ మనం చూడలేదుగానీ, 1982 వరకూ, మన మధ్య జీవించిన శ్రీ స్వామివారిని దర్శించగలిగామనుకుంటే మనమెంత అదృష్టవంతులమో తెలుస్తుంది. వారు శరీరంతో వుండగా తమ విశ్వరూపాన్ని, మహిమనూ చాలా గోప్యంగా వుంచారు. తమ కీర్తి వ్యాపనాన్ని చిత్రమైన రీతులలో అరికట్టేవారు. మహాసమాధి తరువాతనే భక్తులు తమ దివ్యానుభవాలను ఒకరితో ఒకరు చెప్పుకొని తన్మయత్వం పొందే భాగ్యం కలిగింది.

      ఒకసారి శ్రీ స్వామివారు గొలగమూడిలోని ఆశ్రమ ప్రదేశాన్ని (కోనేరు మరియు ఆంజనేయస్వామి మందిరము ఉన్న ప్రదేశాన్ని) చూపిస్తూ, "అయ్యా, ఇక్కడ పద్నాలుగు గతాలనుండి అన్నం రాసులు రాసులుగా పొగలెగురుతోంది, వేలు పెట్టినవాడేడి?" అని సెలవిచ్చారు. "అన్నం పొగలెగురుతోంది" అంటే, ఈ ప్రదేశమంతా, స్వామివారియొక్క తపశ్శక్తితో పొంగిపొరలుతోంది అని భావం.Upcoming Events
August 24th - Swamy vari Aaradhana